నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరాఖండ్ హరిద్వార్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఆందోళన చేపట్టారు. ఖర్గే సభ తర్వాత హల్ద్వానిలోని రామ్‌లీలా మైదానాన్ని ‘శుద్ధి’ చేయడాన్ని నిరసిస్తూ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హరిద్వార్ కొత్వాలి పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర నిరసన తెలిపారు. ఆ తర్వాత బీజేపీ ఉత్తరాఖండ్ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర భట్ , మరో 15 మందిపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, ఆగస్టు 8న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే నిర్వహించిన బహిరంగ సభ తర్వాత, హల్ద్వానిలోని రామ్‌లీలా మైదానాన్ని ‘శుద్ధి’ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ వివాదం తలెత్తింది. ఈ ఆచారాన్ని సమర్థిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర భట్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది.



