హౌతీ స్థావరాలపై అమెరికా, బ్రిటన్‌ వైమానిక దాడి

హౌతీ స్థావరాలపై అమెరికా, బ్రిటన్‌ వైమానిక దాడిఅమెరికా, బ్రిటన్‌ల వాయుసేనలు యెమెన్‌లోని హౌతీ నియంత్రిత ప్రాంతాలపైన బాంబుల వర్షం కురిపించాయి. గాజాలో పాలస్తీనా ప్రజలపైన ఇజ్రాయిల్‌ చేస్తున్న మానవ హననంపైన నిరసన తెలపటంలో భాగంగా హౌతీ మిలిటెంట్లు ఎర్ర సముద్రంలో రవాణా నౌకలపైన దాడులు చేస్తున్నారు. ఎర్ర సముద్రంలో నౌక రవాణా సజావుగా సాగేందుకు అమెరికా, బ్రిటన్‌ తమ తమ నౌకాదళాలను ఎర్ర సముద్రంలో మోహరించాయి. యమెన్‌లోని 60 హౌతీ స్థావరాలపైన అమెరికా, బ్రిటన్‌ల నౌకాదళాలు భీకరంగా దాడులు చేశాయి.
యెమెన్‌ పైన అమెరికా నాయకత్వంలో జరిగిన దాడులను ఇరాన్‌, సోవియట్‌ యూనియన్లు ఖండించాయి. యెమెన్‌పైన జరుగుతున్న ఈ దాడులు యెమెన్‌ సార్వభౌమాధికారంపైన జరుగుతున్న దాడిగా తాము భావిస్తున్నామని, ఇలా దాడులు చేయటం అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్దమని ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నాస్సర్‌ కనాని ప్రకటించారు. లెబనాన్‌లోని ప్రముఖ మిలిటెంట్‌ సంస్థ హిజ్బుల్లా కూడా ఈ దాడులను ఖండించింది. ఎర్ర సముద్రంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఘర్షణలకు నేపథ్యం ఇలా ఉంది.
హౌతీ మిలిటెంట్లు ఎర్ర సముద్రంలోని నౌకా మార్గాల పై పెద్ద ఎత్తున మిస్సైళ్లను, డ్రోన్లను ప్రయోగిం చారు. ఇది చాలా సంక్లిష్టమైన దాడి అని, అయినప్పటికీ తాము తిప్పి కొట్టామని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ పెంటగన్‌ ప్రకటించింది. మధ్యప్రాచ్యం, మధ్య ఆసియాల్లో అమెరికా కార్యకలాపాలను నిర్వహించే యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ (సెంట్‌కామ్‌) వివరించినట్టు మంగళవారంనాడు అనేక యాంటీ షిప్‌ మిసైళ్లను, డ్రోన్లను దక్షిణ ఎర్ర సముద్రంలోకి యెమెన్‌లోని హౌతీ నియంత్రిత ప్రాంతం నుంచి ప్రయోగిం చటం జరిగింది. 18 డ్రోన్లను, రెండు క్రూయిజ్‌ మిసైళ్లను, ఒక బాలిస్టిక్‌ మిసైల్‌ను అమెరికన్‌ ఎఫ్‌-18 యుద్ధ విమా నాలు, అమెరికా, బ్రిటిష్‌ యుద్ధనౌకలు కూల్చివేశాయని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
నవంబర్‌ 19 నుంచి ఎర్ర సముద్రంలోని వాణిజ్య నౌకలపైన హౌతీ మిలిటెంట్లు 26సార్లు దాడి చేశారు. గాజాలో పాలస్తీనా వాసులపైన ఇజ్రాయిల్‌ చేస్తున్న మారణకాండను ఆపేవరకూ తాము ఇజ్రాయిల్‌ వాణిజ్య నౌకలపైన దాడులు చేస్తూనే ఉంటామని హౌతీ మిలిటెంట్లు ప్రకటించారు. ప్రపంచ వాణిజ్యంలో ఎర్ర సముద్రానికి వ్యూహాత్మక ప్రాధాన్యత ఉంది. ప్రపంచంలో 10శాతం చమురు ఎగుమతులు, ఒక ట్రిల్లియన్‌ డాలర్ల విలువైన సరుకులు ఇరుకైన బాబ్‌ ఎల్‌-మన్డేబ్‌ జలసంధి గుండా నౌకల ద్వారా రవాణా అవుతాయి.
ఈ సంక్షోభం కారణంగా ప్రపంచంలోని 10 అత్యంత పెద్దవైన నౌకా రవాణా కంపెనీ ల్లో ఏడు కంపెనీలు సూయజ్‌ కాలువ, ఎర్ర సముద్రం మార్గం గుండా తమ నౌకలను నడపటాన్ని నిలిపివేశాయి. ఇలా నిలిపివేయటం వల్ల నౌకా రవాణా దక్షిణ ఆఫ్రికాను చుట్టి రావటం జరుతుంది. దానితో నౌకలు గమ్యం చేరటా నికి మరో వారం, పది రోజులు అదనంగా పయనించ వలసిన పరిస్థితి ఏర్పడింది. ఇలా జరగటం వలన రవాణా చార్జీలు మూడు రెట్లు పెరుగుతాయి. గాజా లోకి మానవతా సహాయాన్ని అనుమతించనంత కాలం, ఇజ్రాయిల్‌ గాజా పై దాడులను ఆపనంత కాలం అమెరికా ఎంతగా బల ప్రయోగం చేసి నా తాము ఎర్ర సముద్రం గుండా పయ నించే రవాణా నౌకలపై దాడులను చేస్తూనే ఉంటా మని హౌతీలు బహిరంగంగా ప్రకటించారు.

Spread the love