బ్రెజిల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 25 మంది దుర్మరణం

నవతెలంగాణ- హైదరాబాద్: బ్రెజిల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 25 మంది దుర్మరణం పాలయ్యారు. బ్రెజిల్‌లోని ఈశాన్య రాష్ట్రమైన బహియాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తీరప్రాంత పర్యటన నుంచి పర్యాటకులను తీసుకువస్తున్న మినీ టూరిస్ట్‌ బస్సు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. లోతట్టు బాహియాలోని నోవా ఫాతిమా – గవియావో నగరాల మధ్య ఫెడరల్ రహదారిపై రాత్రిపూట ఈ ప్రమాదం జరిగిందన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని బహియా సివిల్ పోలీసులు చెప్పారు.

Spread the love