Tuesday, April 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొలనుపాకలో అంబేద్కర్‌కు ఘన నివాళులు

కొలనుపాకలో అంబేద్కర్‌కు ఘన నివాళులు

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మహనీయుని సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్బంగా  నాయకులు మాట్లాడుతూ దేశానికి  గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. స్వతంత్ర భారత నిర్మాణంలో ఆయన పాత్ర అపారమని, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛలకు మార్గదర్శకుడిగా నిలిచారని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత రాజ్యాంగానికి ముప్పు వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై పోరాడాలని పిలుపునిచ్చారు. అలాగే భారత కరెన్సీపై డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జై భీమ్ యూత్ నాయకులు గడ్డం నాగరాజు, బల్లేపు సంపత్ కుమార్, పర్ష బంగారయ్య, కొంగరి వెంకటేష్, గ్రామ సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ వెంకటేష్, మాజీ ఎంపీపీ గం దమల్ల అశోక్, ఉప సర్పంచ్ గొట్టం విజేందర్ రెడ్డి, రాజానగరం  సర్పంచ్ వెంకటేశ్వరరాజు, మాజీ ఎంపీటీసీ ఆరె ప్రశాంత్ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగుల శ్రీనివాస్, మోత్కూరి  ఐలయ్య, చాడ రాజు, వార్డు సభ్యులు చిరబోయిన రమేష్, బొంకూరి మల్లయ్య, తేరాల శంకర్, పంచాయతీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, పత్రికా ప్రతినిధులు పాప కారు మాధవరెడ్డి, దూడల సాగర్, తిరునగరి శ్రీనివాస్, ఆరె మల్లేష్, మామిడాల నరసింహులు, మామిడాల బాల మల్లేశం, మామిడాల భానుచందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -