Tuesday, April 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంబేడ్కర్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి

అంబేడ్కర్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం, జూనియర్ కళాశాలలో డా. బి ఆర్ అంబేద్కర్ జయంతిని మంగళవారం ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిచారు. అనంతరం వైస్ ప్రిన్సిపాల్, ప్రముఖ పద్యకవి డా బి.వెంకట్ మాట్లాడుతూ.. అంబేద్కర్ జీవిత సత్యాలను విద్యార్థులు తెలుసుకోవాలని అన్నారు.

రాజ్యాంగ పుస్తకాన్ని ప్రతి ఒక్కరు చదవాలని అన్నారు. యువతగా ఉన్నప్పుడే అంబేద్కర్ వంటి జీవిత గాథలను తెలుసుకోవాలని అన్నారు. అంబేద్కర్ ప్రపంచ మేధావుల్లో ఒకరిగా ప్రసిద్ధులని తెలిపారు. నిమ్నజాతుల సముద్ధరణ కోసం అంబేద్కరు కృషి చేశారని చెప్పారు. ఆయన స్ఫూర్తిపథంలో మనమంతా ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్, సంస్కృతోపన్యాసకులు డా బి.వెంకట్ కవి, ఉపాధ్యాయులుపి.శంకర్, కేబస్వరాజు, కే.నరేశ్, శివాజీ, యం.నాగరాజు, నిశాత్ అంజుం, జూనియర్ అసిస్టెంట్ మనోహర్, బోధనేతరులు-ఆనంద్, గఫార్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -