నవతెలంగాణ – నిజాంసాగర్ : మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయంలో 2027-2028 విద్య సంవత్సరంలో 9,11వ తరగతులలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానానికి నోటిఫికేషన్ మంగళవారం జారీ అయింది. ప్రస్తుతం 8,10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 9,11వ తరగతిలలో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 10 వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.నోటిఫికేషన్ ప్రకారం కామారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల విధ్యార్థులకు 75 శాతం సీట్లను భర్తీ చేయనున్నట్టు విద్యాలయ ప్రిన్సిపల్ సీతా రాంబాబు తెలిపారు.ఇట్టి అవకాశాన్ని గ్రామీణ ప్రాంత విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



