Tuesday, April 14, 2026
E-PAPER
Homeహైదరాబాద్రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత: ప్రొ.అర్జున్ రావు కుతాడి

రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత: ప్రొ.అర్జున్ రావు కుతాడి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా హెరిటేజ్ తెలంగాణ విభాగం, హైదరాబాద్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హెరిటేజ్ తెలంగాణ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. డా. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం దేశానికి మార్గదర్శకమైందని, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం అని అన్నారు. యువత రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డా.పి.నాగరాజు, డిప్యూటీ డైరెక్టర్, రాములు నాయక్, నర్సింగ్ నాయక్, ఏడి మల్లూ నాయక్, ఓడిఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -