Wednesday, April 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంబేద్కర్ జయంతికి అధికారుల గైర్హాజరు రాజ్యాంగ విరుద్ధం 

అంబేద్కర్ జయంతికి అధికారుల గైర్హాజరు రాజ్యాంగ విరుద్ధం 

- Advertisement -

హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవాలి 
ఉపసర్పంచ్ హజహర్ అలీ 
నవతెలంగాణ – నవాబు పేట
అధికారికంగా నిర్వహించే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలకు కొందరు గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనకపోవడంతో భారత రాజ్యాంగ నిర్మాత, ఆర్థికవేత్త, న్యాయకోవిదుడు, అంటరానితనంపై అలుపెరుగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి ‘భారతరత్న’ డా.బి.ఆర్. అంబేడ్కర్ కు అవమానంగా అనిపిస్తుందని మండల కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ నాయకులు నవాబు పేట గ్రామ ఉపసర్పంచ్ హజహర్ అలీ తీవ్రంగా ఖండించారు.

వారిపై అధికారికంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కొందరు అధికారులు గైర్హాజరు కావడంపై ఎంపీడీవో జయరాం నాయక్ ను వివరణ కోరగా అధికారికంగా నిర్వహించే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను అధికారులు ప్రజాప్రతినిధులు తమ విధిగా భావించి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఈ కార్యక్రమానికి హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -