Wednesday, April 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సామాజిక బహిష్కరణకు గురైన జాతిలో పుట్టిన ధ్రువతార అంబేద్కర్

సామాజిక బహిష్కరణకు గురైన జాతిలో పుట్టిన ధ్రువతార అంబేద్కర్

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
వివక్షాపూరిత సమాజంలో, సామాజిక బహిష్కరణకు గురైన జాతిలో పుట్టిన ధ్రువతార డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గుడిపాటి నరసయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే అంబేద్కర్ జయంతి వేడుకల కార్యక్రమానికి హాజరై,వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. ఈ మేరకు దళిత జాతులను పీడిస్తున్న అంటరానితనం కులవివక్షతకు వ్యతిరేకంగా, ఆలయాల ప్రవేశాలు, పాఠశాలల్లో చదువు, త్రాగునీరు బలహీన వర్గాలకు అందాలని పోరాటం చేశారని అన్నారు.

అంటరాని కులాలు ఆర్థికంగా, రాజకీయంగా బలపడనిదే, వారి సమస్యలకు పరిష్కారం దొరకదని భావించి, రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పించాడని సూచించారు. దేశంలో ఓటు హక్కు ద్వారా రాజకీయ సమానత్వం కోసం కృషి చేసిన ఏకైక వ్యక్తి అంబేద్కర్ అని, ప్రతి పౌరునికి తల్లి జన్మనిస్తే,అంబేద్కర్ రాసిన రాజ్యాంగం జీవితాన్ని ఇస్తుందనేది కాదనలేని సత్యం అన్నారు. సామాజిక అసమానతులపై అలుపెరుగని పోరాటం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి అంబేద్కర్. అంబేద్కర్ ఆశయాలను యువత ఆచరణలో పెడితే ఉత్తమ సమాజ స్థాపన సాధ్యమవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న, తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, జయంతి వేడుకల నిర్వహణ కమిటీ అధ్యక్షులు చింతకుంట్ల పరుశురాం, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కోతి కిషోర్, అన్నారం గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి, బండరామారం గ్రామ సర్పంచ్ కోరుకొప్పుల నరేష్ గౌడ్, నూతనకల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పసుల అశోక్ యాదవ్, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -