- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమేల్) పోస్టులకు సంబంధించిన సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను MHSRB విడుదల చేసింది. మొత్తం 1,931 పోస్టులకు 1:1.25 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసినట్లు తెలిపింది. ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన సెప్టెంబర్ 16 నుండి 26 వరకు జరుగుతుందని పేర్కొంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది మెరిట్ జాబితా, సెలక్షన్ లిస్ట్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
- Advertisement -



