Wednesday, April 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర స్థాయి ర్యాంకర్ ను సన్మానించిన ఎమ్మెల్యే 

రాష్ట్ర స్థాయి ర్యాంకర్ ను సన్మానించిన ఎమ్మెల్యే 

- Advertisement -

నవతెలంగాణ – మిడ్జిల్
ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రజా ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన మిడ్జిల్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని మౌనికను మంగళవారం జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి  సన్మానించి అభినందించారు.

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 440లో 438 మార్కులు సాధించి స్టేట్ ర్యాంకర్‌గా నిలిచిన మౌనిక, జడ్చర్ల మున్సిపాలిటీలోని కావేరమ్మపేట మైనార్టీ గురుకుల కళాశాలలో విద్యను అభ్యసించడం గర్వకారణమని పేర్కొన్నారు. కష్టపడి చదువుతే  ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే నాణ్యమైన విద్య అందిస్తుందని చెప్పారు.

భవిష్యత్తులో ఉన్నత చదువులకు సహాయ  సహకారాలు అందిస్తానని కష్టపడి చదివి తల్లిదండ్రులకు గ్రామానికి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని తెలిపారు. అనంతరం విద్యార్థి మౌనికను తల్లిదండ్రులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అల్వాల్ రెడ్డి, నాయకులు వెంకటయ్య, సుదర్శన్ రెడ్డి , మహమ్మద్ గౌస్, మల్లికార్జున రెడ్డి, నరేందర్ రెడ్డి, రమేష్,  మిడ్జిల్ సర్పంచ్ ఎడ్ల శంకర్ కొత్తపల్లి సర్పంచ్ మంగమ్మ శ్రీనివాసులు, రమేష్, హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -