నవతెలంగాణ- రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ)గా టి. వేణుమాధవ్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఈ పదవిలో కొనసాగుతున్న బి. బిక్షపతి ములుగు జిల్లా ఎస్ఈగా బదిలీ కావడంతో ఆయన స్థానంలో వేణుమాధవ్ ను నియమించారు.వేణుమాధవ్ ప్రస్తుతం కార్పొరేట్ కార్యాలయంలో జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తూ ఉండగా సిరిసిల్లకు బదిలీపై వచ్చారు.
గతంలో జనగామ జిల్లాల్లో సూపరింటెండింగ్ ఇంజనీర్‌గా సేవలందించారు.జిల్లాలో నాణ్యమైన విద్యుత్ సరఫరా, వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా వేణుమాధవ్ తెలిపారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ, విద్యుత్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తానన్నారు.



