– సీపీఐ (ఎం)నాయకులు పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
అంబేద్కర్ దృక్పథంలో కమ్యూనిస్ట్ సందేశంగా “ఆర్థిక అసమానతలు తొలగించకుండా సమాజంలో పూర్తి సమానత్వం రాదు” అని సీపీఐ (ఎం)జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు. అంబేద్కర్ జయంతి ని పురస్కరించుకొని మంగళవారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ లో సీపీఐ ( ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రం పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పకడ్బందీగా అమలు చేయడమే అంబేద్కర్ కు నిజమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు చిరంజీవి,హమాలీ సంఘం నాయకులు ఏసు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ ఆద్వర్యంలో..
స్త్రీ సమానత్వ హక్కులు కై పోరాడిన మహనీయుడు – మున్సిపల్ ఛైర్పర్సన్ జూపల్లి శశికళ రమేష్ బాబు
– ప్రపంచానికి ఆదర్శప్రాయుడు – మున్సిపల్ కమీషనర్ నాగరాజు
– మున్సిపాలిటీ ఆద్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
అణగారిన అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడి ప్రపంచ ఖ్యాతిని పొందిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని మున్సిపల్ ఛైర్పర్సన్ జూపల్లి శశికళ రమేష్ బాబు అన్నారు. అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలను మున్సిపల్ కార్యాలయం తో పాటు మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కమిషనర్ బి. నాగరాజు పాల్గొన్నారు.అలాగే అంబేద్కర్ నగర్‌లో జరిగిన కార్యక్రమంలో చైర్పర్సన్ జూపల్లి శశికళ మాట్లాడుతూ.. స్త్రీ సమానత్వం కోసం పోరాడిన మహానుభావుడు అంబేద్కర్ అని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గానే కాకుండా భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహానేతగా ఆయన చిరస్థాయిగా నిలిచారని తెలిపారు.
ఆయన అడుగుజాడల్లో నడవాలని ప్రతి ఒక్కరికీ పిలుపునిస్తూ, సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



