– ప్రారంభించిన ఛైర్పర్సన్ జూపల్లి శశికళ రమేష్ బాబు
– తీరనున్న పాదచారుల దాహం
నవతెలంగాణ – అశ్వరావుపేట
ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో పలు ప్రాంతాల్లో చలివేంద్రాలను మున్సిపల్ చైర్‌పర్సన్ జూపల్లి శశికళ రమేష్ బాబు మంగళవారం ప్రారంభించారు. పట్టణంలోని రింగ్ రోడ్డు సెంటర్,పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. ప్రజలు ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లోనే తమ పనులు ముగించుకోవాలని సూచించారు. అవసరమైతే బయటకు రావాల్సి వస్తే తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి. నాగరాజు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



