- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఇటీవలి రాజకీయ పరిమాణాలపై ఇరువురి మధ్య కీలక చర్చ జరిగినట్లు సమాచారం. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరగనున్నట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు, వారు ఇచ్చిన వివరణ తదితర అంశాలపై కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది.
- Advertisement -



