Wednesday, April 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంబేద్కర్ గొప్ప మేధావి, మానవతావాది

అంబేద్కర్ గొప్ప మేధావి, మానవతావాది

- Advertisement -

– మండలంలో ఘనంగా జయంతి వేడుకలు
నవతెలంగాణ కమ్మర్ పల్లి 
భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గొప్ప మేధావి, మానవతావాది సర్పంచులు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని ఆయా గ్రామాల్లో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లాడుతూ ఆనాడు అంటరాని తనము, కులవివక్ష, పీడిత వర్గాల అణచివేత లాంటి జాడ్యాలు ఈ సమాజంలో ఉన్నప్పుడు, ఈ అసమానతలను దూరదృష్టితో ముందే గ్రహించి వారిని సమాజంలో అందరితో సమానంగా జీవించేలా, వారికి అన్ని హక్కులు దక్కేలా, రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గొప్ప మేధావి అన్నారు.

సమాజంలో ప్రజల మధ్య అంతరాలు, అసమానతలు లేకుండా అందరూ సమానంగా జీవించినపుడే వారికి మనం ఘనమైన నివాళి అర్పించినట్టు పేర్కొన్నారు.ఆయన స్ఫూర్తిని తీసుకొని మనమందరం ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -