Wednesday, April 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆత్మకూరు పోలీసులు

వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆత్మకూరు పోలీసులు

- Advertisement -

బాధితురాలి ఇంటి వద్దనే కేసు నమోదు
నవతెలంగాణ – ఆత్మకూరు
బాధితుల ఇంటి వద్దనే కేసు నమోదు చేసే నూతన కార్యక్రమాన్ని ఆత్మకూరు పోలీసులు చేపట్టారు. తెలంగాణ పోలీసు విభాగం ప్రజాసేవా మొదలుపెట్టిన నూతన కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్థానిక పోలీసులు అక్కంపెట్ గ్రామానికి చెందిన మాదాసి అనిత భర్త దయాకర్ తన భర్త ప్రతిరోజు తాగి వచ్చి విపరీతంగా కొడుతూ మానసికంగా ,శారీరకంగా ఇబ్బందులు గురి చేస్తున్నాడని ఆరోపించారు.

తన భర్త దయాకర్ పై కేసు నమోదు చేసి చట్టరిత్య చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో కోరింది. ఎస్సై తిరుపతి బాధితురాలు ఇంటికి చేరుకొని, అక్కడే పిటిషన్ స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రజలకు సౌకర్యవంతంగా, సానుభూతితో సేవలు అందించేందుకు తెలంగాణ పోలీసు ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తోందని, ఇలాంటి చర్యలతో ప్రజలు పోలీసులపై మరింత విశ్వాసం పెంచుతుందని చెప్పారు. గ్రామస్థులు ఈ చర్యను స్వాగతించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -