Tuesday, September 1, 2026
E-PAPER
Homeఆటలుఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్..జస్‌ప్రీత్ బుమ్రా పునరాగమనం

ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్..జస్‌ప్రీత్ బుమ్రా పునరాగమనం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఆఫ్ఘనిస్తాన్‌తో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం బీసీసీఐ మంగళవారం టీమిండియా జట్టును ప్రకటించింది. గాయం కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరమైన స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌తో పునరాగమనం చేశాడు. ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డిల ఎంపిక వారి ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ సిరీస్‌కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుండగా, సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఆఫ్ఘనిస్థాన్‌తో సిరీస్‌కు భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -