మహేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన ‘పిఠాపురంలో … అలా మొదలైంది’ చిత్రం మే 1 న విడుదల కానుంది. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్న పూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ఇందులో ప్రధాన తారాగణం.
మహేష్ చంద్ర సినిమా టీం బ్యానర్ పై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్. ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మించారు.
సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ, ‘ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కి, 2 పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ప్రేమ ఉంది. సునిశిత హాస్యం ఉంది. సెంటిమెంట్ ఉంది. తండ్రీకూతుళ్ల అనుబంధం ఉంది. తప్పటడుగులు వేస్తే యువతరం ఏం కోల్పోతుందో అనే హెచ్చరిక ఉంది. మొత్తంగా అటు పెద్దలకు – ఇటు యువతకు మంచి సందేశం ఉంది. మన పక్కింట్లోనో, మన చుట్టూరా కనిపించే సహజమైన పాత్రలే ఈ సినిమాలో కనిపిస్తాయి. నిజంగా కెమెరా పెట్టి లైవ్ చేసినట్టుగా ఉంటుంది ఈ సినిమా. ఇలాంటి కాన్సెప్టులు ఎప్పుడూ ఎవర్ గ్రీన్. నాకు అప్పట్లో ‘ ప్రేయసి రావే ‘ ఎలా కెరీర్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందో, ఇప్పుడు ఈ సినిమా నా కెరీర్‌ని టర్న్ చేస్తుందని బలంగా నమ్ముతున్నాను. శిల్పి రాజ్ కుమార్ వడయార్ ఇందులో ప్రముఖ పాత్రలో నటించారు. బ్రహ్మానందం వాయిస్ ఓవర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ’ అని తెలిపారు.
‘పిఠాపురంలో’ రిలీజ్‌కి రెడీ
- Advertisement -
- Advertisement -



