Wednesday, April 15, 2026
E-PAPER
Homeసినిమా'ఎం4ఎం' పాటకు బాలయ్య ప్రశంసలు

‘ఎం4ఎం’ పాటకు బాలయ్య ప్రశంసలు

- Advertisement -

జో శర్మ ప్రధాన పాత్రలో దర్శకుడు మోహన్‌ వడ్ల పట్ల తెరకెక్కించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఎం4ఎం’ విడుదలకు సిద్ధమైంది.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ హూ ఈజ్‌ ద కిల్లర్‌’ పాటను చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ పాటకు భాను మాస్టర్‌ కొరియోగ్రఫీ అందిం చారు. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా తెలుగు, హిందీ భాషల్లో ఈ పాట విడుదలైంది.ఆకట్టుకునే ట్యూన్‌తో, ఎనర్జిటిక్‌ మ్యూజిక్‌, విజువల్స్‌తో ఈ పాట ఇప్పటికే మంచి స్పందన పొందుతోంది. ఈ చిత్రంలో జో శర్మ – సమ్బీత్‌ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని మోహన్‌ వడ్లపట్ల దర్శకత్వం వహించి, నిర్మించారు. అగ్రకథానాయకుడు బాలకృష్ణకి ఈ చిత్ర కథానాయిక, అమెరికన్‌ నటి జో శర్మ ఈ పాటను చూపించారు. విజువల్స్‌, ప్రెజెంటేషన్‌ను చూసి బాలకృష్ణ చిత్రయూనిట్‌ని అభినందించారు. అంతేకాకుండా, ‘ఎవడు వాడు’ అనే క్యాచీ లైన్‌ను ఆయన స్వయంగా హమ్‌ చేసి, మేకర్స్‌ని సర్‌ప్రైజ్‌ చేశారు. బాలకృష్ణ లాంటి ప్రముఖ నటుడిని కలిసి, ఆశీర్వాదాలు పొందడం సంతోషంగా ఉందని జో శర్మ తెలిపారు. మోహన్‌ మీడియా క్రియేషన్స్‌ బ్యానర్‌పై, మెక్‌ విన్‌ గ్రూప్‌ యూస్‌ఎ సహకారంతో రూపొందిన ఈ సినిమాను మే 8న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -