- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు సిద్ధమైంది. నేటి నుంచి వారం రోజుల పాటు సాగే ఈ కార్యక్రమాల్లో హామీల అమలు, పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. హైదరాబాద్లో కేటీఆర్కాంగ్రెస్ పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేయనున్నారు. ఆరు గ్యారెంటీల వైఫల్యాలపై నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, ఫ్లెక్సీల ప్రదర్శనతో పాటు, ప్రజలకు బకాయి ఉన్న హామీలను గుర్తుచేస్తూ బాకీ కార్డుల పంపిణీ చేపట్టనుంది.
- Advertisement -



