నవతెలంగాణ – మిడ్జిల్ : ఉమ్మడి రాష్ట్రంలో విప్లవాత్మకమైన పథకాలు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో నే ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్, 108/104 ఉచిత అత్యవసర వైద్య సేవలు, ఇందిరమ్మ ఇళ్లు, జలయజ్ఞం వంటి పథకాలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు ఎడ్ల శంకర్ ముదిరాజ్ చెప్పారు. బుధవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట వైయస్సార్ వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఒక నిఖార్సయిన కాంగ్రెస్ సైనికుడిగా, పేద ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు.
ఎండలను సైతం లెక్కచేయకుండా వైఎస్సార్ చేసిన సుదీర్ఘ పాదయాత్ర ద్వారా రైతులు, పేదలు, కార్మికులు మరియు యువత కష్టాలను స్వయంగా తెలుసుకుని ప్రజా హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని గుర్తుచేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకర్ నాయక్, సాయిలు ,మల్లికార్జున రెడ్డి, విజయ్ కుమార్, సత్యం గౌడ్, కృష్ణయ్య గౌడ్, వెంకటయ్య,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు చెన్నయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణ యాదవ్, నాయకులు ఆదాం , ఉస్మాన్ బసవరాజు, జహీర్ నరేష్ గౌడ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.



