నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని కౌలాస్ గ్రామంలో శ్రావణ మాసం పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ యంబరి విద్య సప్తహ కార్యక్రమం నిర్వహించడం కొరకు ఏర్పాట్లను బుధవారం నాడు పర్యవేక్షించడం జరిగింది. ఈసందర్భంగా వందల సంవత్సరాల క్రితం నాటి గ్రామ పొలిమేర లోని పర్వతంపై వేలసి ఉన్న కాశీగుండం జుక్కల్ ప్రాంత ప్రజలకు నమ్మకం కలిగి కోరుకున్న కోర్కెలు తీర్చే ఆరాధ్యుడు గా కొలువుదీరి ఉన్నాడని భావిస్తారు. ప్రతి ఏటా భారీగా మొక్కులు తీర్చుకోవడం కోసం శ్రావణ మాసం నుండి శివరాత్రి దీక్ష ప్రారంభం నుండి భక్తులు,నాయకులు, సందర్శకులు, చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్ర,కర్ణాటక సరిహద్దు గ్రామాల నుండి జనాలు వస్తారు. భక్తుల సౌకర్యార్థం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో దారి, మరియు స్తంబాలు, విధీ లైట్లు, భక్తులకు నీటి వసతి కల్పించడం జరిగిందని తెలిపారు. భక్తీ శ్రద్ధలతో పూజించి వార్కారీలు ఏడు రోజులు పాటు నిత్యం 24/7 వీణ, భజన , పోతిపూజ, గాతపూజ, నిత్య అన్నదానం వివిధ గ్రామాల నుంచి వచ్చిన భజన మండలి సభ్యులకు గ్రామస్తులు నిర్వహిస్తారు.
కౌలాస్ గ్రామంలోని కాశీగుండం సప్తహ కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షించిన సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



