Saturday, September 5, 2026
E-PAPER
Homeక్రైమ్ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కేరళలోని త్రిశూర్‌ జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కైపమంగళం సమీపంలోని పనంబికున్నులో రహదారిపై నిలిపి ఉంచిన లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తమిళనాడుకు చెందిన విద్యార్థులై ఉండొచ్చని పోలీసులు తెలిపారు. తమిళనాడు రిజిస్ట్రేషన్‌ ఉన్న కారు గురువాయూర్‌ నుంచి కొడుంగల్లూర్‌ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -