- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ నేటితో ముగియనుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేశారు. గోదాముల్లో నిల్వలు పేరుకుపోవడం, సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నెల రోజుల పాటు చౌక ధరల దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. ఇప్పటికీ బియ్యం తీసుకోని లబ్ధిదారులు సాయంత్రంలోగా తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ సూచించింది.
- Advertisement -



