Thursday, April 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎండలు మండుతున్నాయ్.. కూలీలు జాగ్రత్తలు పాటించండి: ఎఫ్ఏ

ఎండలు మండుతున్నాయ్.. కూలీలు జాగ్రత్తలు పాటించండి: ఎఫ్ఏ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని నాగల్ గావ్ ఎఫ్ఏ బాబు గురువారం క్షేత్రస్థాయిలోకి ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామంలోని ప్రభుత్వ స్థలంలో ఉపాధి కూలీలతో ఫీడర్ ఛానల్ పనులు నిర్వహిస్తున్నాం అని తెలిపారు. రోజురోజుకు ఎండల తీవ్రత ఎక్కువవుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా సమయం నిర్ధారణ చేసిందని వెల్లడించారు. ఉదయం 6 గంటలకే పని ప్రదేశానికి చేరుకోవాలని తెలిపారు. అదేవిధంగా 11 గంటలలోపు కూలీలందరూ తమ ఇండ్లకు వెళ్లిపోవాలని అన్నారు. ఎక్కువ వేడి ఉన్నప్పుడు కూలీలు పనితో పాటు తమ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని సూచించారు. వడదెబ్బ రాకుండా ప్రతి గంటకు మంచినీళ్లు తాగాలని చెప్పారు. వీలైతే మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగాలని తెలిపారు. పని ప్రదేశంలో ఎఫ్ఏతో పాటు గ్రామ సర్పంచ్ జాదవ్ సునంద విజయ పటేల్, టెక్నికల్ అసిస్టెంట్ లు కూడా ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -