Thursday, April 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిత్ర కళాకారునికి ఉపాధ్యాయుల సన్మానం

చిత్ర కళాకారునికి ఉపాధ్యాయుల సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని చిత్రకళ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ప్రముఖ చిత్రకారుడు బాస బాల్ కిషన్ ను ‘ప్రపంచ కళ దినోత్సవం’  సందర్భంగా గురువారం ప్రధానోపాధ్యాయులు రాజేందర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. జుక్కల్ నియోజకవర్గంలో వినూత్నంగా చిత్రాలు గీసిన చిత్రకారుడిగా బాస బాల్ కిషన్ ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు. సుద్ధ ముక్క, విత్తనాలు, ఆకులు, నీటిపై చిత్రాలు వేశారని, ఆయన ప్రతిభ మండలానికి గర్వకారణం అన్నారు. ఇలాంటి చిత్రకారుడు మా పాఠశాలలో విధులు నిర్వహించడం అభినందనీయమని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -