నవతెలంగాణ-హైదరాబాద్: ఈనెల 18న అంతర్జాతీయ వారసత్వ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ చారిత్రక ప్రదేశాలకు ప్రవేశ రుసుంను ప్రభుత్వం రద్దు చేసింది. హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో అంతర్జాతీయ వారసత్వ దినోత్సవం వేడుకలు జరగనున్నాయి. ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రజలు, పర్యాటకలు సద్వినియోగించుకోవాలని పురావస్తు శాఖ డైరెక్టర్ ప్రొపెసర్ అర్జునరావు కుతాడి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అద్భుతమైన చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఉన్నాయని, వాటిని ప్రపపంచ పర్యాటకులకు పరిచయం చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని చారిత్రక ప్రదేశాలకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా సందర్శించ వచ్చునని, మరిన్ని వివరాలకు తెలంగాణ హెరిటేజ్ శాఖ నెంబర్ 040-23234942 సంపద్రించాలని సూచించారు.
చారిత్రక ప్రదేశాలకు నో ఎంట్రీ ఫీజు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



