Wednesday, April 15, 2026
E-PAPER
Homeహైదరాబాద్నిత్య చైతన్య స్ఫూర్తి జార్జ్ రెడ్డి

నిత్య చైతన్య స్ఫూర్తి జార్జ్ రెడ్డి

- Advertisement -

“నేటికి జార్జ్ మరణించి 54 సంవత్సరాలు అవుతున్న ఆయన అందించిన స్ఫూర్తి, ఆలోచన విధానాలు ఇంకా విద్యార్థుల గుండెల్లో చిరస్థాయిగా, చెరగని ముద్రగా ఉన్నాయంటే ఆయన ఆలోచన విధానం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు..”

జార్జి ఈ లోకంలో భౌతికంగా లేకపోవచ్చు కాని తను ఇచ్చిన నినాదం తన ఆశయాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి ఈ భూమిపై. రెండు పదుల వయస్సులోనే ఆర్ ఎస్ ఎస్ మతోన్మాద గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా వణుకు పుట్టించిన పోరాటయోధుడు. అతనోక నిత్య నూతన చైతన్య దివిటి. ఐన్ స్టీన్ ఆలోచనలు, చేగువేరా ధీరత్వాన్ని కలగలిపిన వ్యక్తిత్వం తనది. విద్యార్థి, మేధావులు, ప్రజాస్వామిక వాదులు ఆయనను హైదరాబాద్ చేగువేరా అని పిలుచుకునే వారు.

ఉస్మానియా యూనివర్సిటీ భౌతిక శాస్త్రంలో చేరిన జార్జ్ క్యాంపస్ లో భూస్వామ్య, అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఉండే ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీలో ఉండి విద్యార్థుల పై కులం పేరుతో దూషణ చేస్తూ వారిని అంటరాని వారీగా చూస్తూ బలహీనవర్గాల విద్యా ర్థులపై దాడులు, మహిళా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి వారికి అండగా నిలిచేవాడు. మతోన్మాద గుండాలపై ఎదురు తిరిగి, వారి అన్యాయాలను ప్రశ్నించిన జార్జ్ విద్యార్థులకు ఒక బాంధవుడిగా మారాడు. క్యాంపస్లో జరుగుతున్న అన్యాయాలపై నిత్యం ప్రశ్నిస్తూ విద్యార్థుల పక్షాన నిలబడేవాడు జార్జి రెడ్డి.

ఆ సమయంలో ప్రపంచంలో జరిగిన ఫ్రెంచ్ పోరాటం, వియత్నం విప్లవ పోరాటాలు, నక్సల్బరీ, శ్రీకాకుళ, గోదావరిలోయ ప్రతిఘటనోద్యమాలు ఆయన జీవితాన్ని విప్లవోద్యమం వైపుగా ఆకర్శించాయి.
1971లో క్యాంపస్ లో జరిగిన విద్యార్థుల ఎన్నికలలో జార్జ్ మిత్ర బృందం పోటీచేసిన అన్ని స్థానాలలో గెలుపొందడం వలన మతోన్మాద విద్యార్థి సంఘానికి గుండెల్లో వణుకుపుట్టడం మొదలయింది. న్యూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్. ఆయన రాసిన ప్రశ్న పత్రాన్ని దిద్దిన బాంబే ప్రొఫెసర్ జార్జిని కలవడానికి హైదరాబాదుకు వచ్చాడంటే ఆయన విషయ పరిజ్ఞానాన్ని మనం అర్ధం చేసుకోవచ్చు. జార్జి సైన్స్ విద్యార్థి అయినప్పటికీను చరిత్రను కూడా అధ్యయనం
చేసి తోటి విద్యార్థులకు విషయ బోధన చేసేవాడు. మార్క్సిజంతో పాటు ప్రపంచంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను అధ్యయనం చేస్తూ సాయంత్ర సమయంలో విద్యార్థులతో చర్చించేవాడు . క్యాంపస్ సమస్యలపై కాకుండా దేశంలో జరుగుతున్న రైతాంగ ఉద్యమాలపై తన గళాన్ని వినిపించి విద్యార్థులను చైతన్య పరిచేవాడు .

జార్జ్ ఉంటే తమ ఆటలు సాగవని గ్రహించిన మతోన్మాదులు ఎట్లయిన అంతమోందించాలనే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. 1972 ఏప్రిల్ 15 తారీకున జరగనున్న విద్యార్థి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను కలవడానికి వెళ్తున్న జార్జిని ఆర్ఎస్ఎస్ వాళ్ళు దూల్ పేట గుండాలతో కిన్నెర హాస్టల్ దగ్గరకు వచ్చిన జార్జినీ హతం చేయాలని మాటు కాసి ఒక్కసారిగా అతని పై విరుచుకుపడి దాదాపు 32 కత్తిపోట్లతో జార్జిని హతమోదించారు. నేటికి జార్జ్ మరణించి 54 సంవత్సరాలు అవుతున్న ఆయన అందించిన స్ఫూర్తి, ఆలోచన విధానాలు ఇంకా విద్యార్థుల గుండెల్లో చెరగనిముద్రగా ఉన్నాయంటే ఆయన ఆశయం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. నేటికి కూడా సమాజాన్ని చీల్చి, తమ భావజాలాన్ని వ్యాపింప చేసుకోవాలని మతోన్మాద శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. మతోన్మాద శక్తుల కుట్రలను తిప్పికొడుతూ సమాజాన్ని చైతన్య పర్చడం ద్వారా ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే మనం ఆయనకు అందించే ఘనమైన నివాళి అవుతుంది.

కామగోని శ్రావణ్డి
ఎస్ఏ రాష్ట్ర కన్వీనర్
9640154590

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -