Thursday, April 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పల్లె రమేష్ గౌడ్ పై ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

పల్లె రమేష్ గౌడ్ పై ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

- Advertisement -
  • కామారెడ్డి జిల్లా అంబేత్కర్ సంఘాల పిలుపు
  • నవతెలంగాణ – కామారెడ్డి
  • ఈనెల 14న పరిధిపేట గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా పల్లె రమేష్ గౌడ్ అనే వ్యక్తి వచ్చి అంబేద్కర్ జీవిత చరిత్ర కోసం దళితులకు ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారని, భావిస్తే తన వ్యక్తిగత కక్షలుపెట్టుకొని అహంకారపూరితంగా, డబ్బుందనే భావంతో మాట్లాడుతూ అంబేద్కర్ సంఘాలు అడుక్కు తింటున్నయ్ ఇంకా బిచ్చమెత్తుకుంటున్నారనీ మాట్లాడడం సరికాదని కామారెడ్డి జిల్లా అంబేద్కర్ సంఘాల నాయకులు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అంబేద్కర్ సంఘాల నాయకులపై నీచమైన మాటలు మాట్లాడినందుకు నిజంగా చాలా భాధేస్తుందన్నారు. బహుజన బిడ్డఅని చెప్పుకునే రమేష్ గౌడ్ ఇంట్లో కనీసం అంబేద్కర్ ఫోటో లేదన్నారు. ఫరీద్ పేట్ లో చాలా ఎదిగిన అంబేద్కర్ సంఘ నాయకులు, ఎస్సి, ఎస్టి ఉపాధ్యాయ సంఘం నాయకులు చాలామంది ఉన్నారన్నారు.
  • ఇప్పటికైనా నువ్వు తప్పు ఒప్పుకొని అన్ని సంఘాల ముందర బహిరంగ క్షమాపణ చెబితే వదిలేస్తాం అన్నారు. ఈ విషయంలో నీకు సపోర్ట్ చేసిన వాళ్లపైన, నీ పైన ఏఎస్పీ కి ఫిర్యాదు చేసినట్లు అంబేద్కర్ సంఘ నాయకులు పేర్కొన్నారు. నీతో పాటు నీకు సపోర్ట్ గా తిడితే తప్పేముంది, అని మాట్లాడిన ఇద్దరు వ్యక్తులు ముత్తయ్య , గోపాల్ రెడ్డి, మంగళి సురేష్ పైన ఇద్దరిపైన ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కచ్చితంగా త్వరలో ,మీ ఫరీద్ పేట్ లో ఇల్లు ముట్టడి చేస్తాం.. తర్వాత జిల్లా వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం.. లేదంటే నీ పల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవి తొలగించేంతవరకు కూడా మేము పోరాటం చేస్తాం అని పేర్కొన్నారు.
  • పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు, సీఎంకు కంప్లైంట్ చేస్తాం.. వెంటనే అందరికీ నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నీ రాజకీయ జీవితాన్ని మేము ముగిస్తామని అంబేద్కర్ సంఘాల పక్షాన హెచ్చరిస్తున్నాం అన్నారు. అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల బాబు, జిల్లా గౌరవ అధ్యక్షులు సంగి రాజలింగం, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తోల్ల గంగారాం, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టెంకి బాల్ రాజు, ఎమ్మార్పీఎస్, రాష్ట్ర మాజీ అధ్యక్షులు బట్ట వెంకట్ రాములు, ఎమ్మార్పీఎస్ జిల్లా మహిళ అధ్యక్షురాలు సత్తిగారి లక్ష్మి, అంబేద్కర్ సంఘము జిల్లా నాయకులు నాలాపురం సురేష్ వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -