Thursday, April 16, 2026
E-PAPER
Homeఖమ్మంప్రయివేట్ ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు

ప్రయివేట్ ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు

- Advertisement -

లోపాల గుర్తింపు – నోటీసుల జారీ
నవతెలంగాణ – అశ్వారావుపేట

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఆదేశానుసారం గురువారం అశ్వారావుపేట పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు మరియు డయాగ్నొస్టిక్ సెంటర్ల పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.  జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆదేశాల మేరకు జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ (మలేరియా) డాక్టర్ రాందాస్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి.

ఈ సందర్భంగా ఆస్పత్రులలో అనుమతులు, శానిటేషన్, రికార్డుల నిర్వహణ, వైద్య సేవల నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు. పలు చోట్ల లోపాలను గుర్తించిన అధికారులు సంబంధిత నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఓ నాగలక్ష్మి, డీపీఎంఓ మోహన్, హెల్త్ ఎడ్యుకేటర్ బేబీ, జూనియర్ అసిస్టెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య సేవల ప్రమాణాలను మెరుగుపర్చే దిశగా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -