Saturday, September 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు 

ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్  
ఆలేరు పట్టణంలో శనివారం పీఎంశ్రీ జిల్లా ప్రజా పరిషత్  ఉన్నత   పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయ దినోత్సవం  ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు  దాసరి మంజుల పాఠశాల లో 05 గురు బెస్ట్ టీచర్స్  డాక్టర్, పి,. రంగయ్య, పి శోభ, ఎం  శ్రీధర్ ఆర్  కవిత, డి . జ్యోస్నా ల ని సెలెక్ట్ చేసి వారిని సేవలను గుర్తిస్తూ సన్మానం చేసారు. బాధ్యతాయుతంగా, వృత్తి నిబద్దత తో పని చేసే టీచర్స్ ని మనం గుర్తించాలని, ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని ఈ సందర్బంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల, కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిగాయి. విద్యార్థులు ఉపాధ్యాయులను సత్కరించారు. సర్వేపల్లి రాధాకృష్ణ ని స్మరించుకుంటూ ప్రసంగించారు.  పాఠశాల కళాశాల, ప్రిన్సిపల్ కే సురేఖ ,ఫిజికల్ డైరెక్టర్ భాస్కర్ , హరికృష్ణ, రవి,ప్రసన్న సంధ్య, స్వప్న, రామారావు పాల్గొన్నారు.

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బహుదూర్ పేటలో , సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు కే మమత మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ కీర్తి ప్రతిష్టలను విద్యార్థులకు వివరించారు గురువుల యొక్క ప్రాముఖ్యతను తెలిపారు.  ఉపాధ్యాయులు ఏం, లతా, ఏ, అరుణ, అంగన్వాడి   ఉపాధ్యాయురాలు ఎం అన్నపూర్ణ  విద్యార్థులు పాల్గొన్నారు.

పట్టణంలోని ఎంపీపీ, ఎస్, ప్రాథమిక పాఠశాల  సర్వేపల్లి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ  జయంతిని పురస్కరించుకొని ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు, భారతమ్మ  అధ్యక్షతన ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు .విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణ  ప్రతిమను పూలతో అలంకరించారు.  ఉపాధ్యాయులు కందుకూరి శ్రీనివాస్, నర్మదా,  చిట్టిబాబు, సుదర్శన్, రమేష్, సరళ తదితరులు పాల్గొన్నారు. ఐటిఐ కళాశాలలో, వి ఆర్ కళాశాల, ఎస్ ఆర్ కళాశాల, ప్రభుత్వ ప్రైవేటు డిగ్రీ కళాశాలల లో జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -