తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలు నేడు (ఆదివారం) జరగబోతున్న నేపథ్యంలో ఎన్నికలలో పోటీ చేస్తున్న ప్యానల్స్ లో ఒకటైన మన ప్యానెల్ సభ్యులు నేడు కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు.
సి కళ్యాణ్ మాట్లాడుతూ, ‘ఇతర ప్యానల్స్ కొన్ని హామీలు, వాగ్దానాలు చేసినవి చూసాము. మేము అలాంటివి ఏం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ మేము చేసినవి అందరికీ కనిపిస్తున్నాయి. కొత్తగా వచ్చి సేవలు చేస్తాం అంటున్నారు. ఇప్పటి వరకు ఏం చేశారు? ఎన్నికల సమయంలో వచ్చి హామీలు ఇచ్చి, వాగ్దానాలు చేస్తున్నారు. అధికారంలో ఉండి కూడా నిర్మాతలకు సహాయంగా నిలబడలేదు. నిర్మాతల మండలి ఒక ఛారిటీ. నేను మద్రాస్ నుండి ఇక్కడ వరకు వచ్చాను. చరిత్ర తెలుసుకుని మాట్లాడండి. చిన్న నిర్మాతలను, చిన్న సినిమాలను సపోర్ట్ చేయడానికి మా ప్యానెల్ ఉంది. ఒకసారి నిర్మాత ఒక సినిమా చేస్తే మెడిక్లైమ్ వచ్చేలా మేము చేసాము. ఎన్నికల తర్వాత నేను ప్రెసిడెంట్, ఎన్నికల తర్వాత కచ్చితంగా అందరితో కలిసి పని చేస్తాను. మాలో ఉన్న వారిపై బ్లాక్ డాట్ చూపిస్తే వెంటనే విత్ డ్రా చేసుకుంటాను. సంవత్సరానికి 300 చిన్న సినిమాలు వస్తున్నాయి. ఆ సినిమా కోసం పని చేసిన వారు బావుండాలి అంటే చిన్న నిర్మాతలు బావుండాలి’ అని అన్నారు.
‘కళ్యాణ్ ఉన్నత వ్యక్తి. ప్రసన్న నిలకడగా ఉండే వ్యక్తి. కౌన్సిల్ లో మేము అధికారంలోకి వచ్చాక అన్ని అందరికీ అర్థం అయ్యేలా చేస్తాము’ అని చదలవాడ శ్రీనివాసరావు చెప్పారు.
టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ,‘గతంలో మమ్మల్ని ఎన్నికల సమయంలో మోసం చేశారు. నేను చాలా మంది చిన్న నిర్మాతలకు అండగా నిలబడ్డాను’ అని అన్నారు.
చిన్న నిర్మాతలు బాగుండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



