అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ కొమ్మాలపాటి సమర్పణలో హర్ష్ రోషన్ నటించిన చిత్రం ‘తెల్ల కాగితం’. అక్టోబర్2న మూవీ రిలీజ్ అవుతుంది. నక్షత్ర హీరోయిన్‌గా, రమేష్ బండ్రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు బాబీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, ‘జీవితంలో తెలిసీ తెలియక అందరూ తప్పులు చేస్తుంటారనే విషయాన్నే ఈ సినిమాతో చెప్పాలనుకున్నారు. అదే తెల్ల కాగితం మీద ఎర్ర మచ్చ పడితే ఎలా ఉంటుందనేదే కథ. అదే ఈ సినిమా. తెల్లకాగితం మూవీ ఇన్నోసెంట్ లవ్‌స్టోరి. యూత్‌కి, ఫ్యామిలీస్‌కి కనెక్ట్ అయ్యే సినిమా. నిర్మాత కృష్ణతో నాకు ఇరవైయేళ్ల జర్నీ. ఈ సినిమాకు అన్నీ రకాలుగా వెనుకుండి సక్సెస్ వచ్చే వరకు ప్రయత్నం చేస్తుంటాం’ అని తెలిపారు. ‘ఈ కథ నాకు షూటింగ్ కంటే ముందే వినిపించారు. దిల్ రాజు చెప్పినట్లు ఇదొక ఇన్నోసెంట్ లవ్ స్టోరీ. ఇందులో చాలా లేయర్స్ ఉన్నాయి. బ్లాక్ బస్టర్ సినిమాకు ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి’ అని డైరెక్టర్ బాబీ చెప్పారు.
బివిఎస్ రవి మాట్లాడుతూ,‘కచ్చితంగా సినిమా చాలా పెద్ద సినిమా అవుతుంది. ఇంత మందికి నచ్చిన కథ..ఇంత మంది చేయాలనుకున్న కథ..ఎంతో మందికి నచ్చే కథ అవుతుంది’ అని చెప్పారు.
డైరెక్టర్ రమేష్ బండ్రెడ్డి మాట్లాడుతూ,‘మన అందరి జీవితాల్లో కొన్ని దశలుం టాయి. అయితే అందరూ మా తెల్ల కాగితం దశను దాటే వచ్చుంటారు. మా కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. అందరూ రిలేట్ అవుతారు. సాంగ్స్ సహా అన్నీ చక్కగా కుదిరాయి. బ్లాక్ బస్టర్ తీశామని నమ్ముతున్నాం. ప్రేక్షకులు కూడా బ్లాక్ బస్టర్ చేస్తారని నమ్ముతున్నాం’ అని తెలిపారు. ‘ఇదొక సినిమా మాత్రమే కాదు..ఓ మంచి ఫీలింగ్. తెల్ల కాగితం అంటే ఏదో ఈ రాము కథో లేదా ఆశా కథో, లేకపోతే ఇంకెవరో స్నేహితుల కథో అని అనుకుంటారు. కానీ ఇది మనందరి కథ. పదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివిన ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే కథ ఇది’ అని హీరో హర్ష్ రోషన్ చెప్పారు.
‘తెల్లకాగితం’.. ఓ ఇన్నోసెంట్ లవ్‌స్టోరీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



