- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తోందని, ఈ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని ఇంఛార్జి ఎంపిడిఓ శ్రీరామూర్తి, డిఈ అజ్మీరా శ్రీకాంత్, ఏఈ రజినికాంత్ అన్నారు. గురువారం తాడిచెర్ల నిర్మాణం చేపట్టిన పలు ఇండ్లను తనిఖీ చేశారు. లబ్ధిదారులు బిల్లుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంటి నిర్మాణాన్ని బట్టి దశల వారిని బిల్లులు మంజూరవుతాయన్నారు.
- Advertisement -


