Sunday, September 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రేక్ష‍కుల్ని ఆద్యంతం నవ్వించే ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’

ప్రేక్ష‍కుల్ని ఆద్యంతం నవ్వించే ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’

- Advertisement -

హీరో శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’గా అలరించ బోతున్నారు. జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 9న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ,‘కామ్రేడ్ అంటే స్నేహి తుడు. కళ్యాణ్ అంటే శుభం. ఎప్పుడూ పక్కవాళ్ల శుభం కోరుకునే స్నేహితుడు. సినిమా అంతా సరదా సరదాగా ఉంటుంది. ఇలాంటి మంచి కథ తీసుకొచ్చిన కోనకి థాంక్యూ. అలాగే భాను, నందు చాలా అద్భుతంగా రాశారు. డైరెక్టర్ జానకిరామ్‌కి చాలా పెద్ద సూపర్ హిట్ రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. “కామ్రేడ్‌ని విడగొడితే కామ్ రెడీ. నిశ్శబ్దంగా ఉండే రాజు, మెల్లగా వచ్చ, హృదయాలను దోచే రాజు’ అని రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ,‘కొత్త దర్శకులకు శ్రీ విష్ణు అవకాశాలు ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం. ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసే వారిని కామ్రేడ్స్ అంటారు. కాకపోతే సెన్సార్ వాళ్లు ‘కామ్రేడ్’ అనే పదంపై అభ్యంతరం తెలిపారని విన్నాను.

సెన్సార్ ఇబ్బంది పెట్టడం ధర్మం కాదు. సినిమా అనేది చాలా మంది శ్రమతో కూడుకున్న పరిశ్రమ. దయచేసి ఆ పరిశ్రమని ఇబ్బంది పెట్టకండి. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ. దాన్ని మీరు అడ్డుకోవద్దు. ఇది నా విజ్ఞప్తి. ఈ టీజర్ చూస్తే నాకు చాలా మంచి వినోదం, ప్రేమ కనిపిస్తున్నాయి’ అని అన్నారు. ‘కోన వెంకట్ నాకు గాడ్‌ఫాదర్. ఈ కథ నేను విన్నాను. కచ్చితంగా చాలా పెద్ద హిట్ అవుతుంది. జానకిరామ్ చాలా కాన్ఫిడెంట్ డైరెక్టర్. కచ్చితంగా ఈ సినిమాకి డబ్బులు వస్తాయి’ అని డైరెక్టర్ బాబీ చెప్పారు. డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ,‘కోన ‘నిన్ను కోరి’తో నన్ను డైరెక్టర్‌ని చేశారు. ఆయన టేస్ట్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. శ్రీ విష్ణుతో నాకు ‘సోలో’ సినిమా నుంచి ట్రావెల్ ఉంది. ఈ సినిమాని ఆడియన్స్ రిపీట్‌గా చూస్తారని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ‘ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని దర్శకురాలు నందిని రెడ్డి అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -