Friday, April 17, 2026
E-PAPER
Homeఆటలువైశాలి కొత్త చరిత్ర

వైశాలి కొత్త చరిత్ర

- Advertisement -

ఫిడే మహిళల క్యాండిడేట్స్‌ టోర్నీ విజేతగా
నిలిచిన తొలి భారతీయురాలు
సైప్రస్‌:
ఫిడే మహిళల క్యాండిడేట్స్‌ టోర్నీ విజేతగా నిలిచిన ఆర్‌. వైశాలి తొలి భారతీయురాలిగా నయా చరిత్రను లిఖించింది. ఈ టోర్నీ చరిత్రలో భారత్‌కు చెందిన ఒక మహిళా గ్రాండ్‌మాస్టర్‌ విజేతగా నిలవడం ఇదే తొలిసారి. బుధవారం రాత్రి జరిగిన 14వ, ఫైనల్‌ రౌండ్‌లో కాటెరీనా లాగ్నో(ఉక్రెయిన్‌)ను ఓడించిన వైశాలి ఫిడే మహిళల క్యాండిడేట్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో ఈ ఏడాది చివర్లో జరిగే మహిళల ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ కోసం జూ వెన్‌జున్‌(చైనా)తో తలపడనుంది. 1952లో తొలిసారి మహిళల క్యాండిడేట్స్‌ టోర్నీ ప్రారంభం కాగా.. 1997వరకు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత టోర్నీగా మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత మ్యాచ్‌ ఫార్మాట్‌ స్థానంలో నాకౌట్‌ టోర్నమెంట్‌లో వచ్చాయి. మహిళల ప్రపంచ ఛాంపియన్‌ విజేతను తేల్చడానికి ఫిడే మ్యాచ్‌ ఫార్మాట్‌ను పునరుద్ధరించిన తర్వాత 2019లో క్యాండిడేట్స్‌ టోర్నీ తిరిగి ప్రారంభమైంది. ఈ టోర్నీలో రష్యా గ్రాండ్‌మాస్టర్లదే హవా. 1952నుంచి 1988వరకు ఏకచక్రాధిపత్యం చెలాయించిన రష్యా గ్రాండ్‌మాస్టర్లకు తొలిసారి చైనా గ్రాండ్‌మాస్టర్లు చెక్‌ పెట్టారు. 1990లో షీ జుంగ్‌ రష్యా గ్రాండ్‌మాస్టర్ల రికార్డుకు బ్రేక్‌ వేయగా.. ఆ తర్వాత 1992లో జార్జియా 1994లో హాంగేరీ గ్రాండ్‌మాస్టర్లు టైటిల్‌ విజేతలుగా నిలిచారు. 1998 నుంచి 2021 వరకు ఈ టోర్నీని రద్దు చేయగా.. తిరిగి 2022 నుంచి మహిళల క్యాండిడేట్స్‌ టోర్నీ పునరుద్ధరించబడింది. 2022, 2024లో చైనా మహిళా గ్రాండ్‌మాస్టర్లు విజేతలుగా నిలువగా.. 2026లో అంచనాలకు మించి రాణించి రమేష్‌బాబు వైశాలి విజేతగా నిలిచి త్రివర్ణ పతకాన్ని ప్రపంచపటంలో లిఖించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -