- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జార్ఖండ్ ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి, జేఎంఎం సీనియర్ నేత సుదివ్య కుమార్ సోను(56) గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున గిరిడీహ్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గిరిడీహ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న సుదివ్య కుమార్ సోను.. జార్ఖండ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఉన్నత, సాంకేతిక విద్య, పట్టణాభివృద్ధితో పాటు పర్యాటకం, కళలు-సంస్కృతి, క్రీడలు, యువజన వ్యవహారాలు వంటి శాఖలను కూడా పర్యవేక్షించారు. ఆయన మృతిపై సీఎం హేమంత్ సోరేన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- Advertisement -



