- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న లభ్దిదారుడి గృహ ప్రవేశ కార్యక్రమానికి మండల పరిధిలోని మధుర తండా సర్పంచ్ చౌహాన్ అనితామోమన్ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన ప్రతి లబ్దిదారుడు త్వరతగతిన ఇండ్లు నిర్మించుకోవాలని సూచించారు. గ్రామాల్లో నిరుపేదలు, ఇండ్లులేనివారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. అంతకుముందు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రవేశ కార్యక్రమానికి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ జీపీ కార్యదర్శి , గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



