Sunday, September 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వెయ్యిరోజుల రేవంత్ పాలనపై బీఆర్‌ఎస్ నిరసన

వెయ్యిరోజుల రేవంత్ పాలనపై బీఆర్‌ఎస్ నిరసన

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
వెయ్యిరోజుల కాంగ్రెస్‌ పాలనపై ప్రతిపక్ష‍ బీఆర్‌ఎస్‌ నాయకులు మండల పరిధిలోని పెద్ద తడగూర్‌ లో నిరసన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తామని నమ్మబలికి, 1000 రోజులైనా పూర్తి చేయకపోవడం రేవంత్ రెడ్డి అసమర్ధ పాలనకు నిదర్శనం అన్నారు. దీనికి తోడు వెయ్యిరోజుల పాలనపై సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. అబద్దాలు, బూతులు మాట్లాడుతూ.. పాలన సాగించడం రేవంత్‌రెడ్డి వైఖరికి నిరద్శనమని మండిపడ్డారు. ఒక సీఎం హోదాలో ఉండి, బజారు వాడిలా మాట్లాడడం తగదని హెచ్చరించారు. ఇప్పటికైనా పాలనపై దృష్టిపెట్టాలని ఉద్భోదించారు. రైతు వేదిక, డంపింగ్ యార్డ్ వద్ద కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూయిస్తూ నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి పాలన వైఫల్యాలను ఎండగట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -