నవతెలంగాణ-ఆసిఫాబాద్
జిల్లా కేంద్రంలో ఆసిఫాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు డే వేడుకలు క్లబ్ అధ్యక్షుడు రమణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ సమాజంలో మంచి చెడులను నిక్కచ్చిగా చూపుతూ కొన్నిసార్లు శత్రువులను కూడా తయారు చేసుకునే వృత్తి జర్నలిజం అన్నారు. అటువంటి వృత్తిని నిబద్ధతతో నిర్వహిస్తూ సమాజ హితానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాతలను సేకరించామని 360 మందితో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి కావలసిన వారికి అప్పటికప్పుడు రక్తం అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి శనివారం జిల్లా కేంద్రంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అవసరమైన వారికి బెల్లంపల్లికి తీసుకువెళ్లి ఆపరేషన్ చేయిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం జర్నలిస్టు దినోత్సవం రోజు ప్రజల కోసం పనిచేస్తున్న కొంతమంది జర్నలిస్టులను సన్మానించుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఉత్తమంగా పనిచేస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన రావుల శంకర్, శ్రీమంతుల వేణుగోపాల్, చిప్ప సురేష్, గణపురం మహేష్, మురుమురువార్ రాజు, బర్ల వెంకటేష్ లను శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం చైర్మన్ ఫయాజ్, క్లబ్ సెక్రెటరీ బోయిరే ప్రకాష్, మాజీ అధ్యక్షుడు నాంపల్లి శంకర్, డైరెక్టర్లు తారిక్, సంజయ్, వేణు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.



