Sunday, September 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డాక్టర్ కావాలన్న కళకు పేదరికం అడ్డు

డాక్టర్ కావాలన్న కళకు పేదరికం అడ్డు

- Advertisement -

– పై చదువులకు ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు
నవతెలంగాణ – కోహెడ
పేదరికాన్ని అధిగమించి చదువులో ప్రతిభ కనభరిచినప్పటికి పై చదువులకు వెళ్ళేందుకు ఆర్థికంగా అడ్డుకుంటున్న పరిస్థితి నెలకొంది. కోహెడ మండల కేంద్రానికి చెందిన వేల్పుల ప్రదీప్ ప్రతిభతో ఎంబీబీఎస్‌లో సీటు సాధించాడు. ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించిన ప్రదీప్‌కు కౌన్సెలింగ్‌లో ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు లభించింది. అయితే నిరుపేద కుటుంబానికి చెందిన ప్రదీప్‌కు కళాశాలలో చేరేందుకు సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతున్నాయని తెలిపాడు. ప్రదీప్ తండ్రి హమాలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండటంతో అంత మొత్తాన్ని భరించే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిభ ఉన్నా ఆర్థిక పరిస్థితి వెంటాడుతోంది. పదోతరగతి వరకు హుస్నాబాద్ గురుకుల హాస్టల్‌లో చదివి, ఇంటర్మీడియట్ బెల్లంపల్లి సీఈవో కళాశాలలో పూర్తి చేశాడు. చదువుపై ఆసక్తితో కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటు సాధించాడు. అయితే సీటు వచ్చిన ఆనందం కన్నా, దాన్ని కొనసాగించేందుకు అవసరమైన ఖర్చు ఎలా సమకూర్చుకోవాలన్న ఆందోళనే కుటుంబాన్ని వెంటాడుతుంది. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వైద్య విద్యను పూర్తి చేసి మంచి వైద్యుడిగా ఎదగాలన్నదే తన లక్ష్యమని ప్రదీప్ తెలిపాడు. ఆయన తండ్రి హమాలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దాతలు, సేవా సంస్థలు, ప్రజలు తన చదువుకు ఆర్థిక సహాయం అందిస్తే వైద్య విద్యను పూర్తి చేసి పేదలకు సేవ చేయాలని ఉందని పేర్కొన్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -