Sunday, September 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వల్లెంకుంట మానేరులో ఇసుక తోడేళ్ళు..

వల్లెంకుంట మానేరులో ఇసుక తోడేళ్ళు..

- Advertisement -

అభివృద్ధి మాటున..అక్రమ దందా
పట్టించుకోని రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని వల్లెంకుంట, మల్లారం, తాడిచెర్ల తదితర గ్రామాల్లోని మానేరు పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొద్దిరోజులుగా జోరుగా సాగుతున్నాయి. అధికారుల కళ్లుగప్పి ట్రాక్టర్ యజమానులు, అక్రమ ఇసుక వ్యాపారులు దందాను మూడు పువ్వులుగా, ఆరు కాయలుగా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ట్రాక్టర్లలో ఇసుకను కూలీలతో కాకుండా నేరుగా ట్రాక్టర్ డ్రోజర్లతో అడ్డూ అడుపు లేకుండా ఓసిపి గోతులను తలపించేలా భారీగా తవ్వకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పిడి, ఏపిడీ అధికారులచే అనుమతులతో డీడీలు లేకుండా ఉచితంగా అందించాలని ఆదేశించింది.

ఇదే అదునుగా భావించిన ఇసుకాసురులు రాత్రి, పగలు అనే తేడాలేకుండా పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు. కొయ్యుర్ పోలీస్ స్టేషన్, పారెస్టు రేంజ్ కార్యాలయానికి ఆమడ దూరంలో వల్లెంకుంట మానేరు నుంచి ట్రాక్టర్ డోజర్ ద్వారా ఇసుకను తోడేస్తూ కాటారం, గంగారం, ఎడ్లపల్లి, గారెపల్లి ప్రాంతాలకు ఉదయం మొదలుకొని అర్ధరాత్రి వరకు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ వేలు గడుస్తున్నా అధికారులు మాత్రం కళ్ళులేని కాబోదుల్లా చూస్తున్నారు. అక్రమ ఇసుకను ఆపాలని పలువురు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన ఇసుక వ్యాపారులు ఇచ్చే మామూళ్లకు తలొగ్గి పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. తాడిచెర్ల మానేరు నుంచి పెద్దతూండ్ల, ఖాసింపల్లి, జంగెడు, భూపాలపల్లికి అక్రమంగా తరలిస్తూ వేలు ఘడిస్తున్నారు. అక్రమ ఇసుక దందాకు అడ్డుకట్ట వేయకపోతే ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో భూగర్భజలాలు అడుగంటిపోయి తాగు, సాగు నీటికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం పొంచిఉందని రైతులు వాపోతున్నారు.

ధనార్జనే ధ్యేయంగా..
ఇసుకాసురులు ధనార్జనే ద్యేయంగా పగలు, రాత్రి తేడాలేకుండా గుట్టుగా అక్రమ ఇసుక దందా నడుస్తోంది. వల్లెంకుంట, తాడిచెర్ల మానేరు నుంచి అక్రమార్కులు ట్రాక్టర్లతో కాటారం, భూపాలపల్లి పట్టణాలకు తరలిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో తాడిచెర్ల నుంచి ఓసిపి బెల్టు మార్గం నుంచి ఖాసింపల్లి, జంగెడు, భూపాలపల్లి, గొర్లవిడు, కొంపెళ్లికి భారీగా ఇసుకను తరలిస్తూ వ్యాపారులు లక్షలు ఘడిస్తున్నారు. వల్లెంకుంట కేశారంపల్లి గ్రామాల్లో రహస్య ప్రాంతాల్లో ఇసుక డంపులు సైతం పోస్తూ రాత్రియితే టిప్పర్లలో ఇసుకను దూర ప్రాంతాలకు  తరలిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతా జరిగిన సంబంధించిన రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -