- Advertisement -
నవతెలంగాణ-ఆసిఫాబాద్
మండలంలోని రహపెళ్లి గ్రామపంచాయతీలోని రహపెళ్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గ్రామ సర్పంచ్ సుంకరిమంగ వాటర్ బాటిల్లను అందజేశారు. తన కుమారుడు సాయికుమార్ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు వాటర్ బాటిల్స్ అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. గ్రామంలో విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పెంటయ్య, బూరుగూడ లచ్చన్న, వార్డ్ తిరుపతి, నాయకులు రాజేంద్రప్రసాద్, శేఖర్, ఉపాధ్యాయులు దేవాజి, సూర్యనారాయణ పాల్గొన్నారు.
- Advertisement -



