- Advertisement -
నవతెలంగాణ -ముధోల్
బాసరలో అంబికా నాథ శర్మ స్థాపించిన ద్వాదశ జ్యోతిర్లింగ మందిరంలో ఆదివారం నిర్వహించిన అష్టావధానం పలువురిని ఆకట్టుకుంది. ఈ అష్టావధానంలో యం వి పట్వర్ధన్ అవధానిగా, పోటు హైమతి, సంచాలకులుగా వ్యవహరించారు. ఈ అష్టావధానానికి ప్ఫచ్చకులు, పద్య కవులు డా.కోవెల శ్రీనివాస చార్యులు నిషిద్దాక్షరి, దేవిప్రియ సమస్య, జాధవ్ పుండలిక్ రావు పాటిల్ దత్తపది, పీసర శ్రీనివాస్ గౌడ్ వర్ణన, శ్యాం సుందర్ రెడ్డి, ఆశువు, కొండూరు పోతన్న ఛందోభాషణం, కడారి దశరథ్ న్యాస్తాక్షరి, అప్రస్తుత ప్రసంగం, పడిగెల దేవిదాస్, గంట నాదం స్వరూప రాణి, చిత్ర కవిత భూమేష్ పృచ్ఛకులుగా ఉన్నారు. ఈ సందర్భంగా హాజరైన కవులను ఘనంగా సన్మానించి అభినందించారు.
- Advertisement -



