చైనా మాస్టర్స్ విజేత సాత్విక్, చిరాగ్
ఫైనల్లో చైనా షట్లర్లపై ఘన విజయం
షెన్‌జెన్ (చైనా) : బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ టైటిల్స్‌లో భారత అగ్రశ్రేణి షట్లర్లు సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలు పదో విజయం సాధించారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నమెంట్ విజేతగా నిలిచిన సాత్విక్, చిరాగ్‌లు చరిత్ర సృష్టించారు. ఆదివారం జరిగిన ఫైనల్లో చైనా షట్లర్లనే ఓడించి ఈ టైటిల్ సాధించిన తొలి భారత షట్లర్లుగా నిలిచారు. మూడు గేముల పాటు హోరాహోరీగా సాగిన టైటిల్ పోరులో 11-21తో తొలి గేమ్‌లో సాత్విక్, చిరాగ్‌లు నిరాశపరిచినా.. వరుసగా తర్వాతి గేముల్లో 21-13, 21-17తో విజయాలు నమోదు చేశారు. సాత్విక్, చిరాగ్‌లకు ఈ సీజన్లో ఇది రెండో సూపర్ 750 టైటిల్ కావటం విశేషం.



