Monday, September 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపగిలిన మిషన్ భగీరథ పైపు..రోడ్డుపై వృధాగా పోతున్న నీరు

పగిలిన మిషన్ భగీరథ పైపు..రోడ్డుపై వృధాగా పోతున్న నీరు

- Advertisement -

– కలుషిత నీరే ప్రజలకు సరఫరా
– ఐదు రోజులు అవుతున్న పట్టించుకోని అధికారులు
– మరమ్మతులు చేయాలని కోరుతున్న ప్రజలు

నవతెలంగాణ-మద్దూరు : మద్దూరు మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ సమీపంలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి నాలుగు రోజులవుతున్న నీరు వృధాగా పోతున్న మరమ్మతులు చేయడంలో అధికారులు పట్టించుకోవడంలేదని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ పగలడంతో ప్రజలకు సరఫరా చేసే త్రాగునీరులు కలుషితనీరు చేరుతుందన్నారు. మద్దూరు మండల కేంద్రం నుండి వివిధ గ్రామాలకు వెళ్లే మెయిన్ మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిన సంబంధిత అధికారులు మరమ్మతులు చేయడంలో నిర్లక్ష్యం చేయడమేంటని మండల ప్రజలు మండిపడుతున్నారు. గ్రామపంచాయతీ సమీపంలోనే మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిన మండల అధికారులు పగిలిపోయిన మిషన్ భగీరథ పైప్ లైన్ ను చూసుకుంటూ వెళ్తున్నారు తప్ప మరమ్మతులు చేయడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత  అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై పగిలిపోయిన మిషన్ భగీరథ పైప్ లైన్ కు వెంటనే మరమ్మతులు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -