నవతెలంగాణ-ఆసిఫాబాద్
జిల్లాలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి అన్నారు. జిల్లా కేంద్రంలోని జనకాపూర్ రైతు వేదికలో ఎంపిక చేయబడిన కృషి సఖీలకు తెలంగాణ వ్యవసాయ శాఖ, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహించనున్న ప్రకృతి వ్యవసాయ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం పెరుగుతున్న మందుల తాకిడి నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించాల్సిన అవసరం ఉందన్నారు. పెట్టుబడి రాబడిని రైతులు అంచనా వేస్తారని అలా కాకుండా ఆరోగ్య పరిస్థితి, నేల సారవంతంపై వారికి అవగాహన కల్పించాలని చెప్పారు. మందుల వాడకం తగ్గించే దిశగా ప్రత్యేక కృషి చేయాలన్నారు. దీనికోసం విత్తన శుద్ధి చేయడం, జీవామృతం తయారు చేయడం, కంపోస్ట్ ఎరువుల తయారిపై ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకొని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. నిరంతరంగా వీటిని వాడడం వల్ల దిగుబడి కూడా పెరుగుతుందని అన్నారు. ప్రకృతి సేద్యం దీర్ఘకాలంలో లాభసాటిగా ఉంటుందని ఆ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మధు, కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి శాస్త్రవేత్త మహేష్ తో పాటు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



