– ఈ నెల 9న ఉద్యోగ మేళా
నవతెలంగాణ – కామారెడ్డి
ఇంటర్మీడియట్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ రంగంతో పాటు ఇతర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 9న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. విజయ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, తెలంగాణ స్కిల్ కనెక్ట్ ఆధ్వర్యంలో హెచ్‌సీఎల్ టెక్బీ సంస్థలో ఉద్యోగాల ఎంపిక కోసం ఈ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపికకు 2025, 2026 సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని తెలిపారు. ఎంపీసీ, ఎంఈసీ విద్యార్థులు ఇంటర్లో కనీసం 75 శాతం మార్కులు, గణితంలో 80 శాతం మార్కులు సాధించి ఉండాలని పేర్కొన్నారు.
బైపీసీ, సీఈసీ, వృత్తి విద్యా కోర్సుల్లో కంప్యూటర్స్, రిటైల్ మేనేజ్మెంట్ చదివిన వారు మొత్తం 75 శాతం మార్కులు సాధించి ఉండాలని తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణత ధ్రువపత్రం, ఇంటర్మీడియట్ ధ్రువపత్రం, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులతో పాటు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్‌తో హాజరు కావాలని సూచించారు. సెప్టెంబర్ 9న బుధవారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగే ఉద్యోగ మేళాకు అర్హులైన విద్యార్థులు తప్పనిసరిగా హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హెచ్‌సీఎల్ టెక్బీ అధికారిక వెబ్సైట్ ద్వారా ముందస్తుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు హెచ్‌సీఎల్ తెలంగాణ ప్రాంత ఇన్చార్జి ఆర్. రాజేష్‌కుమార్‌ను 8074065803, 9701665424 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.



