- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మరోసారి సమగ్ర ఓటర్ జాబితా(సర్) ప్రక్రియ గడువును ఎన్నికల సంఘం పెంచింది. క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణకు ఉన్న గడువును పొడిగించింది. ముందుగా ఈ నెల 16 వరకు ఉన్న గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించినట్లు తెలిపింది. క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ అనంతరం వాటి పరిశీలన, పరిష్కార ప్రక్రియ కొనసాగనుంది. ఈ ప్రక్రియను నవంబర్ 5లోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం పూర్తైన తర్వాత నవంబర్ 9న తెలంగాణలో తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.
- Advertisement -



